Headlines

జపాన్ చక్రవర్తి అకిహితోకు గుండే ఆపరేషన్ విజయవంతం

ఇది కాంగ్రెస్ బలహీనత కాదా

వైద్యులారా.. క్లినిక్‌లా – ఆస్పత్రులా తేల్చుకోండి

తెలంగాణ రాదని జైపాల్ చెబుతున్నారా

జపాన్ చక్రవర్తి అకిహితోకు గుండే ఆపరేషన్ విజయవంతం

Posted in: INTERNATIONAL NEWS | Comments (0)

జపాన్ చక్రవర్తి అకిహితోకు గుండే ఆపరేషన్ విజయవంతం

గత కొంత కాలంగా గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చిన జపాన్ చక్రవర్తి అకిహితోకు శనివారం హృద్రోగ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

78 ఏళ్ల అకిహితోకు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెనొప్పి రావడంతో తక్షణం ఆయనను యూనివర్శిటీ ఆఫ్ టోక్యో ఆసుపత్రికి తరలించి అక్కడ బైపాస్ సర్జరీ చేసినట్టు ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. 

వైద్య పరీక్షలను నిర్వహించిన తర్వాత, అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. కాగా, అకిహితో త్వరగా కోలుకోవాలని కోరుతూ జపాన్ ప్రజలు ప్రదర్శనలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

myadmin @ February 19, 2012

ఇది కాంగ్రెస్ బలహీనత కాదా

Posted in: HEAD LINES | Comments (0)

ఇది కాంగ్రెస్ బలహీనత కాదా

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి మరింత ఆలస్యం చేయడంలోని ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. తెలంగాణలోని ఆరు, కోస్తాలోని ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్టికీ , జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి మరింత ఆలస్యం చేస్తున్నారు. దానికి కారణం ప్రధానంగా జగన్ ఆస్తుల కేసు ఒక కొలిక్కి రాకపోవడమేనా అన్న చర్చ కూడా ఉంది. ఈ కేసులో ఒక అభిప్రాయానికి వచ్చి జగన్ ను అరెస్టు చేయడమా?లేక చేయకపోవడమా? అన్నది తేల్చుకుని , ఆ తదుపరి అనర్హత వేటు వేయాలన్నది ఒక ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ ప్రక్రియలో రాజ్యాంగ స్పూర్తిని స్పీకర్ నాదెండ్ల మనోహర్ విస్మరిస్తున్నారన్న విమర్శలు వచ్చినా, కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి అనుగుణంగా వ్యవహరించకతప్పడం లేదు.అన్ని ఉప ఎన్నికలు ఒకేసారి రాకూడదన్న కాంగ్రెస్ లక్ష్యం ఇప్పటికి సఫలం అయినా, సాధ్యమైనంతవరకు ఎన్నికలను ఆలస్యం చేయడం ద్వారా పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడమే అంతిమ ఉద్దేశంగా కనబడుతోంది.అయితే ఈరకంగా వ్యవహరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలహీనతను బటయపెట్టుకుంటోందన్నది వాస్తవం.

myadmin @ February 19, 2012

వైద్యులారా.. క్లినిక్‌లా – ఆస్పత్రులా తేల్చుకోండి

Posted in: HEAD LINES | Comments (0)

వైద్యులారా.. క్లినిక్‌లా – ఆస్పత్రులా తేల్చుకోండి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేస్తూ ప్రైవేటుగా క్లినిక్‌ను నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. అందువల్ల ఇటు ప్రభుత్వ వైద్య ఉద్యోగమా లేక ప్రైవేటు క్లినిక్‌లా అనేది వైద్యులు తేల్చుకోవాలని సూచించారు. 

దీనిపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యులు మనస్సు పెట్టి చేయాలనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలని లేదంటే ఉద్యోగం వదిలేయాలన్నారు. ఉద్యోగం వదిలేసి ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లవచ్చునని సూచించారు. 

ఇకపోతే.. 104 ఉద్యోగుల సమ్మెను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

myadmin @ February 19, 2012

తెలంగాణ రాదని జైపాల్ చెబుతున్నారా

Posted in: NATIONAL NEWS | Comments (0)

తెలంగాణ రాదని జైపాల్ చెబుతున్నారా

కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు.కేంద్రం తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో దీనిపై బిల్లు వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక తెలంగాణపై చర్చ జరగాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఈ విషయం ఆంధ్ర ప్రాంతంలోని రాజమండ్రికి వెళ్లి మాట్లాడడం విశేషం. అంతకుముందు రోజు జైపాల్ రెడ్డి తన రాజకీయ గురువు అయిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ప్రత్యేక వాదం బలంగా ఉన్నతెలంగాణ నుంచి నాయకుడిగా ఉన్న జైపాల్ రెడ్డి మాజీ సి.ఎమ్ కాసు విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆ తర్వాత తెలంగాణపై చర్చ జరగాలని అనడం సహజంగానే తెలంగాణవాదులలో అసంతృప్తి రగుల్చుతాయి.అయినా పరిస్థితులు మారాయి కనుక జైపాల్ రెడ్డి ఈ ప్రకటన చేశారని అనుకోవాలా? తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు తాను ఎంతగానో ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేశానని చెప్పిన జైపాల్ రెడ్డి ఇప్పుడు దానిపై చర్చ జరగాలని అనడం సహజంగానే ఈ ప్రాంతంలో విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది.అయితే జైపాల్ రెడ్డి ప్రకటన తెలంగాణ ఇప్పట్లో రాదన్న సంకేతాన్ని ఇస్తున్నదా?

myadmin @ February 19, 2012

జగన్‌ను చూసి జడుసుకుంటున్న చంద్రబాబు : శోభానాగిరెడ్డి

Posted in: HEAD LINES | Comments (0)

జగన్‌ను చూసి జడుసుకుంటున్న చంద్రబాబు : శోభానాగిరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జడుసుకుంటున్నారని వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జోస్యం చెప్పారు. ఆమె ఆదివారం మాట్లాడుతూ జగన్‌ను ఎదుర్కోవడం కష్టమని, అందుకే ఆయనపై కాంగ్రెస్, టీడీపీ, కొన్ని ఎల్లోమీడియాలు కలిసి ఆయనపై కుట్ర పన్నాయని ఆరోపించారు. తాము అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని వెళుతున్నామని ఇంతకంటే ఐకమత్యం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి విభేదాలు, చీలికలు లేవన్నారు. 

ప్రతి రోజు ఏదోఒక ప్రజాసమస్యపై జగన్మోహన రెడ్డి ఆందోళన చేస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షం చేయని పనులను జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే టీడీపీ ఓర్వలేక పోతుందన్నారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాల వల్ల చంద్రబాబుకు రాత్రిళ్లు నిద్రపట్టడంలేదన్నారు. 

అంతేకాకుండా, నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు, రామోజీ రావులు కలిసి పన్నిన కుట్రను ఎన్టీఆర్ ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత రామోజీరావు సంగతి తేలుస్తానని ఎన్టీఆర్ ఇదే కర్నూలులో అన్నారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు, రామోజీరావులు జగన్‌ గురించి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

myadmin @ February 19, 2012